Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఘనంగా మాజీ శాసనసభ్యులు మానుగుంట ఆదినారాయణ రెడ్డి వర్ధంతి వేడుకలు. కందుకూరు,అమరావతి జ్యోతి :కందుకూరు విధాన సభ మాజీ సభ్యులు దివంగత మానుగుంట ఆదినారాయణ రెడ్డి వర్ధంతి కార్యక్రమం,బుధవారం ఆయన స్వగ్రామం మాచవరంలో వేలాదిమంది అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన తనయులు ప్రస్తుత ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి , వారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి విగ్రహానికి నిలువెత్తు గజ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదినారాయణ రెడ్డి, ప్రజా బంధుగా, నిగర్విగా కందుకూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు కొనియాడారు .ఈ కార్యక్రమానికి తరలివచ్చిన వేలాదిమంది మానుగుంట అభిమానులు స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోనే ఐదు మండలాల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు మానుగుంట అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi