Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : శింగరాయకొండ వద్దనున్న విమాన లాండింగ్ పూర్తిపై పార్లమెంటులో మాట్లాడిన మాగుంట ఒంగోలు, అమరావతి జ్యోతి: పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి రూలు - 377 క్రింద మాట్లాడుచూ దేశంలో ప్రకృతి వైపరిత్యాలు మరియు కార్యాచరణ ఆకస్మిక పరిస్థితులు సంభవించినపుడు విమానాలు దిగుటకు ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీలు ఏర్పాటుచేసే క్రమంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలో చిలకలూరిపేట – నెల్లూరు సెక్షన్ లో శింగరాయకొండ వద్ద కూడా 3.60 కి. మీ. మేర ఒకటి ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధాన మంత్రికి మరియు కేంద్ర రోడ్డు - హైవేల శాఖా మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ లాండింగ్ ఫెసిలిటీకి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ మరియు కాంట్రాక్టర్ మధ్య 26-12-2019 అగ్రీమెంటు జరిగి, ప్రధాన సివిల్ పనులు 20-12-2021 నాటికి పూర్తయినవి. 28-07-2021 తేదీన భారత విమాన సంస్థ మరియు నేషనల్ హైవే అథారిటీ వారు జరిపిన జాయింటు ఇన్స్పెక్షనులో మైనర్ బెండ్స్ (చిన్న వంకలు) మరియు కర్వ్ (మలుపు) లను గుర్తించారు. ప్రాజెక్టు డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీ, నెల్లూరు, విమాన సంస్థ, కాంట్రాక్టర్లు మరియు సలహాదారులు జరిపిన జాయింటు తనిఖీలో చిన్న వంకలును మరియు మలుపును వాటిని నిటారుగుగా వేయుటకు గల అవకాశాలను అన్వేషించడం కూడా జరిగింది. తదుపరి, సదరు పనులకు మరియు భూ సేకరణకు రూ.26.60 కోట్లు అంచనాతో విజయవాడలోని నేషనల్ హైవే అథారిటీ రీజినల్ ఆఫీసరు ఆమోదానికి 25-01-2023 న పంపడంకూడా జరిగింది. 11 నెలల గడచినను మరియు త్వరితగతిన పూర్తిచేయవలసినదిగా కేంద్ర మంత్రి ఆదేశాలు ఇచ్చినను, సదరు పని ఇప్పటికీ పెండింగులోనే వున్నది. కనుక, ఈ పనికి అత్యధిక ప్రాదాన్యతనిచ్చి, అంచనాను వెంటనే ఆమోదించి జాతీయ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తిచేయవలసినదిగా కేంద్ర మంత్రిని మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరినారు.
Admin
Amaravathi Jyothi