Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సావిత్రిబాయి పూలే కు ఘనంగా నివాళులు కావలి,అమరావతి జ్యోతి: సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆదివారం కావలి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కావలి అసెంబ్లీ టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కావలి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, టీడీపీ నాయకులు తిరువీధి ప్రసాద్ మాట్లాడుతూ స్త్రీ విద్యావంతురాలు అయినప్పుడే కుటుంబం వృద్ధి చెందుతుందని, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపిన మహనీయురాలు, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు పూలే అని తెలిపారు. ఈరోజు మహిళలు అందరూ వివిధ పదవుల్లో ఉండటానికి కారణం పూలే అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు గుండ్లపల్లి శివాజీ యాదవ్, కొల్లూరు అశ్విని, పసుపులేటి పద్మావతి, గుర్రం అనురాధ, కట్టమూరి శ్రీదేవి, రాధమ్మ, షేక్ అయేషా, షబానా, బత్తెమ్మ, హసీనా, అయేషా, జహారా, తదితరులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi