Amaravathi Jyothi - Andhra Pradesh / NTRDistrict : టీడీపీలోకి మరో వైసిపి ఎం ఎల్ ఏ? విజయవాడ అమరావతి జ్యోతి: పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఆ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబును రహస్యంగా కలిసినట్లు సమాచారం. రేపు లేదా ఎల్లుండి టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు టాక్. కాగా పార్థసారథి కొద్ది రోజులుగా మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల బహిరంగంగానే సీఎం జగన్ ను వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని తెలుస్తోంది.
Admin
Amaravathi Jyothi