Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జగనన్న ప్రభుత్వంలో బీసీలకు ఉన్నత పదవులు.... బీద టీడీపిలో ఎమ్మెల్యే గా చేశా కానీ గుర్తింపు రాలేదు*...*సంచలన వ్యాఖ్యలు చేసిన బీఎంఆర్. కావలి ,అమరావతి జ్యోతి ; జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు సుమచిత స్థానం కల్పించారని కావలి మాజ్ఎiమ్మెల్యే, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు అన్నారు. గురువారం కావలి పట్నంలో ఎనిమిదో వార్డులో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయనకు మాట్లాడుతూ బీసీలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపేట వేశారని వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎం గా గెలిపించుకోవాలని అన్నారు. అలాగే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానిక కావలి పట్టణం బాగా తెలిసిన వారని ఆయన మరోసారి గెలిపించుకుంటే కావలి కనకపట్నం అవడం ఖాయమని చెప్పారు. అనేక సంక్షేమ పధకాలను అవినీతి ఎరుగని రీతిలో ప్రజలకు చేరువు చేశారని గత టిడిపి ప్రభుత్వంలో పదేళ్లపాటు పని చేసినా తనకి గుర్తింపు రాలేదని నేడు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న బీసీ బిడ్డగా తనకు అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టరని చెప్పారు. అలాగే మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. విద్యార్థులు చదువుకునేందుకు అమ్మఒడి ,విద్యా దీవెన లాంటి పథకాలు పెట్టి విద్యార్థులు పనికి బదులు బడికి వెళ్లేలా తీర్చిదిద్దారని చెప్పారు. మహిళా సాధికార బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారని చెప్పారు. మహిళా అభ్యున్నతికి కృషిచేసిన ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు కెతిరెడ్డి శివకుమార్ రెడ్డి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, స్వర్ణకార సంఘాల అధ్యక్షుడు నాగాచారి, ఎనిమిదో వార్డు పట్టణ సీనియర్ నాయకులు షాహుల్ ,అమిద్, ఖమర్ బాబు, కె. నారాయణ, తిరివీధి ప్రసాద్, గుర్రం వెంకటేశ్వర్లు, నల్లూరు రమేష్, వైఎస్ఆర్సిపి నాయకులు, పోనుగంటి అనురాధ, 8వ వార్డు ముస్లిం మైనారిటీ నాయకులు, వైసీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు ,వాలంటీర్లు, మెప్మా అధికారులు ,మున్సిపల్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi