Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు: చంద్రబాబు ఒంగోలు,అమరావతి జ్యోతి: రాష్ట్ర ప్రజలకు తెదేపా అవసరం ఎంతో ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా మాట్లాడారు. ''గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇస్తాను. నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదు. పనితీరు బాగాలేకుంటే ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఓట్ల అవకతవకల విషయాన్ని ఇన్‌ఛార్జ్‌లు బాధ్యతగా తీసుకోవాలి. అన్నీ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందనే అలసత్వం వద్దు'' అని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు..
Admin
Amaravathi Jyothi