Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : ఉంగరాలకు గురుతేజం అవార్డు. కడియం, అమరావతి జ్యోతి : కడియం గ్రామానికి చెందిన గణిత ఉపాధ్యాయుడు ఉంగరాల వీరభద్రరావుకి గురుతేజ అవార్డు లభించింది. రాజమండ్రి పుష్కర్ వనంలో జరిగిన కాట్వా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు భద్రరావుని ఘనంగా సత్కరించి ఈ పురస్కారాన్ని అందించారు. గత 26 ఏళ్లగా గణిత శాస్త్రాన్ని బోధిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఆయన తీర్చిదిద్దారు. కాట్వా నేతలు బంగార్రాజు, కోలా సత్యనారాయణ, చలం, చోడిశెట్టి బాలాజీ తదితరులు చేతుల మీదుగా భద్రరావు అవార్డుని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు ఉంగరాల భద్రరావును అభినందించారు. ఉంగరాలకు ఈ అవార్డు రావడం పట్ల కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు తదితరులు అభినందించారు.
Admin
Amaravathi Jyothi