Amaravathi Jyothi - Andhra Pradesh / Vishakhapatnam : వైసీపీకి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రాజీనామా విశాఖపట్నం,అమరావతి జ్యోతి : వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. విశాఖ దక్షిణలో జరుగుతున్న పరిణామాలతో రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ పంపారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సుధాకర్ రాజీనామా చేయడం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది.
Admin
Amaravathi Jyothi