Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 15 నుంచి సంక్రాంతి సంబరాలు కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 15 నుంచి మూడు రోజులపాటు, వలేటివారిపాలెం మండలంలోని కాకుటూరు బస్టాండ్ వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు పొడపాటి సుధాకర్ తెలిపారు. 15వ తేదీ సోమవారం సంక్రాంతి పండుగ రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నియోజకవర్గ స్థాయిలో మెగా ముగ్గుల పోటీలు జరుగుతాయని తెలిపారు. 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి, 17వ తేదీ రాత్రి వరకు రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కందుకూరు నియోజకవర్గం ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంక్రాంతి సంబరాలకు హాజరుకావాలని పొడపాటి సుధాకర్ కోరారు.
Admin
Amaravathi Jyothi