Sunday, 17 May 2026 05:35:10 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

తొలిమాట అదుర్స్ రైతాంగం శ్రేయస్సు కోసం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఇంటూరి

Date : 20 November 2024 06:49 AM Views : 830

Amaravathi Jyothi - Andhra Pradesh / అమరావతి : తొలి మాట అదుర్స్. రైతాంగం శ్రేయస్సు కోసం. రాళ్లపాడు ప్రాజెక్టు సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే ఇంటూరి సోమశిల ఉత్తర కాలువ వెడల్పు, రాళ్లపాడు ఎడమ కాలువ పనులు ప్రారంభించాలి. చంద్రబాబు, లోకేష్ తో పాటు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఇంటూరి కందుకూరు, అమరావతి జ్యోతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో కందుకూరు ప్రజల జీవనాడి రాళ్లపాడు ప్రాజెక్టు సమస్యలపై తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు. కందుకూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం ప్రజల జీవనాడి రాళ్లపాడు ప్రాజెక్టుకు సోమశిల ప్రాజెక్టు నుంచి గొట్టిపాటి కొండపనాయుడు నార్త్ కెనాల్ ద్వారా 1.5 టీఎంసీలు నీరు రాళ్లపాడు ప్రాజెక్టుకు రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆ కాలువలో నీటిపారుదల సరిగా లేక 0.5 టిఎంసి నీరు మాత్రమే ప్రాజెక్ట్ చేరటం ద్వారా పూర్తిస్థాయిలో నీరు రాక కందుకూరు నియోజకవర్గం రైతాంగం పంటలు పండించేందుకు ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు..రాళ్లపాడు ప్రాజెక్టు సంబంధించిన 2018 వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మా స్వగ్రామమైన బడేవారిపాలెం పర్యటనలో రాళ్లపాడు ఎడమ కాలువ పనులకు సంబంధించిన జీవో నెంబర్ 116 ద్వారా ఎడమకాలువ పనులు ప్రారంభమయ్యేలాచర్యలు తీసుకున్నారు.. ఈ ఎడమ కాలువ పనులు పూర్తి అయితే వలేటివారిపాలెం మండలం లింగసముద్రం మండలంలోని వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు.. కానీ గత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులపై ఎటువంటి పురోగతి లేదని ధ్వజమెత్తారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రాళ్లపాడు ప్రాజెక్టును డిప్ ఇరిగేషన్ పథకంలో ప్రాజెక్ట్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.. కానీ గత ప్రభుత్వంలో ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ప్రాజెక్ట్ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులను ఇంటూరి నాగేశ్వరరావు కోరారు.. ముందుగా తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి, యువ నాయకులు నారా లోకేష్ కి మరియు కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: