Saturday, 18 April 2026 02:32:00 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి స్టిక్కర్ను ఆవిష్కరించిన అన్నదానం చిదంబరం శాస్త్రి

అంగలకుదురు క్షేత్రంలో ఆవిష్కరణ

Date : 07 September 2025 12:04 AM Views : 285

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అంగలకుదురులో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి స్టిక్కర్ ఆవిష్కరించిన చిదంబర శాస్త్రి గుడ్లూరు: అంగలకుదురు ఆశ్రమంలో శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి చేతుల మీదుగా ఘనంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్టిక్కర్ ఆవిష్కరణ కార్యక్రమం వాసుదాస స్వామి వారి పరంపరపీఠం అంగలకుదురులో (దాసకుటి) ఆశ్రమంలో నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చెమిడిదపాడు గ్రామ బస్టాండ్ వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి మూలవిరాట్ విగ్రహ స్టిక్కర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయోధ్య బాల రాముని విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో స్వామివారికి యంత్ర సమర్పణ చేసిన డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి చేతుల మీదుగా పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్టిక్కర్ను భక్తుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. స్టిక్కర్ ఆవిష్కరణతో పాటు శ్రీరామానంద్ బిరుదాంకితులు పంగులూరి గోవిందరావుపై వారి శిష్యురాలు ఇందిర రచించిన పుస్తకాన్ని కూడా అన్నదానం చిదంబర శాస్త్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అంగలకుదురు ఆశ్రమ ఆరవ పీఠాధిపతి ఉలిచి సీతారామ శర్మ (పట్టాభి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాభి, గోవిందరావు, చిదంబర శాస్త్రి భక్తులను ఉద్దేశించి, శ్రీరామ్ శరణ్ గురుదేవుల గురించి వివరించారు. ట్రస్ట్ అధ్యక్షుడు ఆలూరి వెంకట హనుమంతరావు మాట్లాడుతూ 108 కోట్ల శ్రీరామనామ తారక మహామంత్ర జపంతో పాటు, ఐదు కోట్ల హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో 50శాతం పూర్తి చేసుకోగలిగామని తెలిపారు. ఆలయ నిర్మాణం అన్నదానం చిదంబర శాస్త్రి సలహా సూచనలు మేరకు నిర్మిస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు , చీరాల ప్రసాద్ , శ్రీలత, ఇందిర, టి శరత్ రెడ్డి,గోవింద రావు శిష్య బృందం పాల్గొన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు హనుమంతరావు, చిదంబర శాస్త్రి తో పాటు పట్టాభి, గోవిందరావుని శ్రీరామనామం, ఆంజనేయ నామంతో ఉన్న శాలువాతో సత్కరించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :