Monday, 20 April 2026 06:51:54 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

టిడిపి బిజెపి జనసేన పొత్తు చారిత్రాత్మకం

Date : 10 March 2024 08:51 PM Views : 229

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : టిడిపి, బిజెపి, జనసేన పొత్తు చారిత్రాత్మకం ఈ కూటమికి ప్రజామోదం - వైసిపి ఇంటిబాట ఖాయం శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న నూకసాని బాలాజీ , ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు,అమరావతి జ్యోతి: త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం-బిజెపి-జనసేన పార్టీల కూటమి చారిత్రాత్మక విజయం సాధిస్తుందని ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఈ పొత్తును స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. కందుకూరు పట్టణంలోని 31వ వార్డు మెరిసి స్కూల్, 60 ఆడుగులు రోడ్డు ఏరియాలో వార్డు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమం జరగగా... బాలాజీ హాజరై ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు. నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితులు, అలాగే వైసిపి నిరంకుశ పాలన నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు ఈ మూడు పార్టీలు ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్టీ, ఎస్సీలపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని అన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నదే కాకుండా చివరకు ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టే స్థాయికి దిగజారి పోయారని విమర్శించారు. ప్రభుత్వం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి అన్నట్టుగా పరిస్థితి తయారైందని, ఇలాంటి దుర్మార్గమైన దారుణమైన పరిపాలనను రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. మూడు పార్టీలు కలిసి రాష్ట్రం కోసం చేపట్టిన మహాయజ్ఞం విజయవంతమయ్యేందుకు ప్రజలందరూ సహకరించాలని బాలాజీ గారు విజ్ఞప్తి చేశారు. కందుకూరులో ఉమ్మడి అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు బరిలో ఉంటారని, అందరికీ నిత్యం అందుబాటులో ఉండే ఆయనను అసెంబ్లీకి పంపిస్తే ప్రజలందరికీ అండగా ఉంటాడని, పూర్తిగా అభివృద్ధి గురించే ఆలోచిస్తాడని బాలాజీ పేర్కొన్నారు. కందుకూరులో సరికొత్త మార్పునకు ప్రజలు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వందల కోట్లు ఖర్చుతో సిద్ధం సిద్ధం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి సభలు నిర్వహిస్తున్నారని, ఆ సొమ్మంతా ప్రజల వద్ద నుంచి దోచుకున్నదేనన్న విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. కేవలం డబ్బులు వెదజల్లి మళ్లీ అధికారంలోకి రావాలన్న కాంక్షతోనే జగన్మోహన్ రెడ్డి చీప్ ట్రిక్స్ చేస్తున్నాడని విమర్శించారు. 175 కు 175 స్థానాలు గెలుస్తామని ప్రగల్బాలు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి.... ఒకచోట ఎమ్మెల్యేలను మరొకచోటకు ఎందుకు పంపిస్తున్నారో సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఒకచోట తయారైన చెత్త మరోచోట బంగారం ఎలా అవుతుందో చెప్పాలన్నారు. ఎంతమందిని ట్రాన్స్ఫర్లు చేసినా, ఎన్నిచోట్లకి పంపినా... అలాంటి వారందరికీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ప్రజలు ఈసారి పూర్తి చైతన్యంతో ఆలోచిస్తున్నారని, ఎవరికి అధికారం అప్పగించాలో ఎవరిని ఇంటికి పంపాలో ఈపాటికి నిర్ణయం తీసేసుకున్నారని నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డు అధ్యక్షుడు అత్తంటి శివకృష్ణ, గుత్తా శ్రీనివాసులు, అంబటి శ్రీనివాసులు, నల్లబోతుల మురళి, కొచ్చర్ల రమణయ్య, పీల.శ్రీనివాసులు, సవిడిబోయిన వెంకటకృష్ణ, సవిడిబోయిన సాయి లాయర్ బెజవాడ కృష్ణయ్య, K .లక్ష్మీనారాయణ, మాచినేని మహేశ్వరరావు, చిలకపాటి.శ్రీనివాసులు,అద్దంకి అనిల్, జమ్మూ చైతన్య, జనసేన నాయకులు ఆకురాతి శ్రీనివాసులు, గుణకాల గణేష్ నాయుడు చిలకపాటి మధుబాబు, రెబ్బవరపు మాల్యాద్రి, రాయపాటి శ్రీనివాసరావు, వడ్డెళ్ల రవిచంద్ర, గొంది నరసింగరావు, ముచ్చు వేణు, షేక్ సలాం, భవానసి వెంకటేశ్వర్లు, షేక్ శతాక్షి, పులి నాగరాజు, కల్లూరి వెంకటేశ్వర్లు, షేక్ ఫిరోజ్, దారం విజయకుమార్, రాచగండ్ల మధుబాబు, మేడ నరసింహారావు, అమ్మనబోయిన వేణు, నందికనమల లక్ష్మణరావు, సవిడిబోయిన వెంకటేష్, పసుపులేటి రమణయ్య, ముప్పవరపు వేణు, చుంచు వేణు గుమ్మ శివ, మచ్చ మనోహర్, షేక్ మమ్ముషా, పసుపులేటి నరేష్, చల్లా మహేంద్ర, షేక్ ఫాజిల్, లింగాబత్తిన మాల్యాద్రి, దార్ల సుబ్బారావు మరి ఇతర నాయకులు పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :