Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నాకు తోడుగా ఉండండి మీకు అండగా ఉంటా..:కాకర్ల సురేష్ జనసేన సైనికులతో ఉదయగిరి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఉదయగిరి, అమరావతి జ్యోతి: నాకు తోడుగా ఉండండి మీకు అండగా ఉంటానని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. గురువారం వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు సమీపంలోని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ఆవరణంలో కాకర్ల సురేష్ జలదంకి కలిగిరి వింజమూరు జనసైనికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గత 45 సంవత్సరాలుగా ఉదయగిరి నియోజకవర్గంలో ఈ ప్రాంత వాసులను ఉపయోగించుకొని రాజకీయంగా ఎదిగి, ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. నన్ను విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో మేకపాటి రాజగోపాల్ రెడ్డి అమెరికా నుంచి వచ్చాడు అక్కడికే వెళతాడు అనడంలో అర్థం లేదన్నారు. 25 సంవత్సరాలు ఇక్కడే ఉంటానని ఈ ప్రాంత అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం అన్నారు. పేదల గడపలు తొక్కితే వారి జీవన ప్రమాణాలు తెలుస్తాయని, నాయకులతో మాట్లాడి వెళితే వారి బతుకులు మారవు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాడని, ప్రతి దానిని తాకట్టు పెట్టారని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనమందరం కలిసికట్టుగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ఏకైక మార్గమన్నారు. యువ కెరటం నారా లోకేష్ యువగలం ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నాడని తెలుగుదేశం అధికారంలోకి వస్తే వారి కష్టాలు తీరుతాయన్నారు. మెట్ట ప్రాంతానికి సాగు త్రాగు నీరు తో పాటు ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించడమే నా ఏకైక లక్ష్యం అన్నారు. అదేవిధంగా విద్య వైద్యం కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. వర్గ విభేదాలు పక్కనబెట్టి కలిసికట్టుగా పని చేసి గిరిపై తెలుగుదేశం జనసేన జెండా ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. అంతకుమునుకు ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండల కేంద్రంలోని నిమ్మలపల్లి రైస్ మిల్లు సెంటర్ నుండి జనసైనికులు జలదంకి కలిగిరి మీదుగా ట్రస్ట్ కార్యాలయం వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. యువత కేరింతలు కొడుతూ కాకర్ల సురేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ సాగించారు. అనంతరం నియోజకవర్గ అభ్యర్థి కాకర్ల సురేష్ ను శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిమ్మలపల్లి రామ చైతన్య, తొటెంపుడి రఘు, సింగమనేని అరవింద్, సురేంద్ర, జానీ, అన్వేష్, మాధవ రావు, రామూర్తి, రమేష్, సురేష్,మహీధర్ వింజమూరు జనసైనికులు మండల కన్వీనర్ బండారు సత్యనారాయణ జిల్లెల్ల రాజా సురేష్ కిషోర్ రవి నారాయణ భరత్ మొన్న జ్యోతి మాల్యాద్రి టిడిపి అభిమానులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi