Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వలేటివారిపాలెం అమరావతి జ్యోతి మండలంలోని సింగమనేని పల్లి కొండారెడ్డి పాలెం నలదలపూరు కలవల్లపంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పాటు సంక్షేమ పథకాలు కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించారని అన్నారు. మరోసారి మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జగనన్న నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నిన్ను గెలిపిస్తారని జగనన్న చెప్పారన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి సాయి రెడ్డికి ఒక ఓటుకందుకూరు అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కి ఒక ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కృపమ్మ ప్రసాదు మాజీ సర్పంచ్ ఉన్నంవెంకటేశ్వర్లు మండల పార్టీ అధ్యక్షుడు పరిటాల వీరాస్వామి జెసిఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు మండల సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబుఎంపీటీసీ చింతలపూడి రవీంద్ర ఉన్నం చిన్నబ్బాయి యాళ్ళ శివకుమార్ రెడ్డి కూచిపూడి విజయ్ కుమార్ కాకు వెంకటస్వామి గుత్తా గోపి అనుమోలు లక్ష్మి నరసింహం తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi