Saturday, 12 September 2026 09:11:28 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

క్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం: మాజీ ఎమ్మెల్యే కందుల

Date : 25 December 2023 08:35 PM Views : 341

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : క్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం. - మాజీ శాసనసభ్యులు కందుల. తర్లుపాడు.అమరావతి జ్యోతి: శాంతి కరుణ సహనం ప్రేమలని ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వ మానవ సహోదరత్వానికి దోహదం చేస్తాయని మార్కాపురం టిడిపి ఇన్చార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పండగ రోజు సందర్భంగా తర్లుపాడు మండలంలోని జగన్నాధపురం, కేతగుడిపి, తర్లుపాడు గ్రామాల్లోని చర్చిలను సందర్శించి క్రిస్టియన్ సోదరీ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రమైన తర్లుపాడు ఎస్సీ కాలనీలోని రెండు చర్చలలో సంతోషాల మధ్య క్రిస్మస్ పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా, రెవరెండ్.డా. ఎం.ఎస్.విజయ్ కుమార్, రెవరెండ్. కందుల రవి ల ఆధ్వర్యంలో దేవునికి మహిమ కరంగా జరిగాయి.క్రిస్మస్ సందర్భంగా చర్చి వారందరికీ, గ్రామస్తులకు శుభములు తెలియజేయడ నిమిత్తం విచ్చేసిన కందుల నారాయణరెడ్డి ప్రజలకు క్రిస్మస్ ను సంతోషాలతో జరుపుకోవాలని, అందరూ ఐక్యతతో జరుపుకోవాలన్నారు. కరుణామయుడు జీసస్ జన్మదిన క్రిస్మస్ మానవులందరికీ పండగ రోజు అని జీసస్ ప్రవచించినట్లుగా ప్రతి ఒక్కరు ఎదుటివారి పట్ల కరుణ, జాలి, దయతో ఉండాలని, క్షమాగుణం అలవర్చుకోవాలని, నిరంతరం సేవానిరతితో మెలగాలని తద్వారా మానవాళి శ్రేయస్సుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రెండు చర్చ్ ల సంఘ కాపరులు మాట్లాడుతూ క్రిస్మస్ అనగా ప్రేమ,సంతోషము,సమాధానమని తెలియజేశారు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని తనను ప్రేమించు వారిని ఆయన ప్రేమిస్తారని, కాపాడుతాడని, రక్షణ ఇస్తాడని, బోధించారు. మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డిని మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రార్థించి, ఆశీర్వదించారు. అనంతరం తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు నారాయణరెడ్డి కేక్ కట్ చేసి సంఘ కాపరికి, పెద్దలకు కేకును పంచిపెట్టారు. కూడిక అనంతరం అందరికీ స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆటలు పోటీలు జరగక సంఘ కాపరి రెవ.డా. విజయకుమార్ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, మండల టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: