Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : చిరు సేవాసమితి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం కడియం, అమరావతి జ్యోతి : చిరు సేవాసమితి అధ్యక్షులు గెడ్డం శివ ఆధ్వర్యంలో కడియం మండలం బుర్రిలంక ఎంపీ యూపీ పాఠశాలలో రాజమండ్రి అభిరామ్ హాస్పటల్ డయోబెటిస్ ఎండోక్రైన్ స్కిన్ సెంటర్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఎం వి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య బృందం సుమారు 135 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ ఉన్నవారికి రాజమండ్రి వారి హాస్పటల్ నందు ఉచితంగా పరీక్షలు చేస్తామని డాక్టర్ ఎంవి శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియపులంక పంచాయతీ సర్పంచ్ రాంజీ, కడియం మాజీ ఎంపీపీ మార్గాన్ని సత్యనారాయణ, కడియపులంక మాజీ సర్పంచ్ గట్టి నరసయ్య, పాటంశెట్టి సుబ్బారావు, చిరు సేవాసమితి, మైత్రి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi