Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తుఫాను బాధితులకు నగదు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎం ఎల్ ఏ మహీదర్ రెడ్డి కందుకూరు,అమరావతి జ్యోతి : కందుకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలలో నివసిస్తున్న కాలనీ వాసులకు కందుకూరి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి చేతులమీదుగా171 మందికి బియ్యం, నిత్యావసర సరుకులు, ఒక సభ్యుడు ఉన్న కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇద్దరు సభ్యులు ఉన్న కుటుంబానికి రెండు వేల రూపాయలు ఇద్దరు పైన ఉన్న కుటుంబానికి 2500 రూపాయలు చొప్పున నగదు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మనోహర్, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు...
Admin
Amaravathi Jyothi