Saturday, 18 April 2026 02:19:30 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిన నాడే కుటుంబాలు బాగుపడతాయి: కాకర్ల సురేష్

Date : 10 March 2024 09:35 PM Views : 240

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : 50వేల మెజార్టీతో గెలిపిస్తాం. ఉదయగిరి ముస్లిం మైనార్టీ మహిళల భరోసా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కోసం కృషి చేస్తా త్రాగునీరు సమస్య పరిష్కారం కోసం మొదటి ప్రాధాన్యత. టిడిపి జనసేన బిజెపి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. వింజమూరు, అమరావతి జ్యోతి: మునుపెన్నడు లేని విధంగా రికార్డులు తిరగరాస్తు 50 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు మహిళలు కాకర్ల సురేష్ కు భరోసా ఇచ్చారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజుచెరువు సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ముస్లిం మైనార్టీ మహిళలు ముస్లిం సోదరులు సుమారు 500 మంది టిడిపి పార్టీలో ఉదయగిరి ఇంచార్జ్ కాకర్ల సురేష్ సమక్షంలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ముస్లిం మాట్లాడుతూ 50వేల మెజార్టీ మెజారిటీతో ఉదయగిరి పై తెలుగుదేశం జెండా ఎగరవేస్తామన్నారు. వారికి ప్రధానంగా ఉన్న సమస్యలను కాకర్ల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా త్రాగునీరు రోడ్లు విద్యుత్ దీపాలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కాకర్ల మాట్లాడుతూ నాకు తోడుగా ఉండండి మీకు అండగా ఉంటానని మనందరి భరోసా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఆయనను ముఖ్యమంత్రి చేసుకుంటేనే సాధ్యమవుతుందన్నారు. 13వ తేదీ నుండి సీతారాంపురం చిన్న నాగంపల్లి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయగిరి రియాజ్ ఆధ్వర్యంలో ఇంతమంది నాకు మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే మీ అందరిని కలుసుకుంటానని మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిన నాడే కుటుంబాలు బాగుపడతాయని దానికోసం పాటు పడతానన్నారు. ఉదయగిరి నాయకులు పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ మన్నేటి వెంకటరెడ్డి బయన్నల ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలో త్వరలో పార్టీ కార్యాలయం అందరికీ అనువైన స్థలంలో ఏర్పాటు చేస్తానన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి జీవన ప్రమాణాలు మారుస్తానని కోరారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు సోదరీమణులు టిడిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :