Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన శ్రీ గాయత్రీ విధ్యార్ధి. కందుకూరు, అమరావతి జ్యోతి: అక్టోబర్ నెలలో కడపలో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో తన సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థి నక్కల మురళీకృష్ణ. వచ్చే నెల 09 నుండి 14 వరకు రాజస్థాన్ లో జరగనున్న జాతీయస్థాయి జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన నక్కల మురళీకృష్ణ ( బిఎ ద్వితీయ సంవత్సరం (హెచ్ ఇ పి ) ని శ్రీ గాయత్రీ విద్యాసంస్థల అధినేత సిహెచ్ రామకృష్ణారావు అభినందించారు. శ్రీ గాయత్రీ డిగ్రీ కళాశాలలో క్రీడా ప్రాధాన్యత వల్లే ఈ విజయం సాధ్యమైందని నక్కల మురళీకృష్ణ తెలియజేశారు. మంగళవారం జరిగిన అభినందన సభలో శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.గీతా శ్రీనివాసరావు మేనేజింగ్ డైరెక్టర్. సి హెచ్.భరద్వాజ్, ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ వి ఉషా చంద్రిక జి1 క్యాంపస్ డీన్ వెంకటేశ్వర్లు జి2 క్యాంపస్ డీన్ నాయబ్ రసూల్ అధ్యాపక మరియు అధ్యాపకతల సిబ్బంది పాల్గొని నక్కల మురళీకృష్ణను అభినందించారు.
Admin
Amaravathi Jyothi