Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : భార్గవ్ కుటుంబాన్ని పరామర్శించిన కావ్య క్రిష్ణారెడ్డి కావలి,అమరావతి జ్యోతి: కావలి పట్టణం 10వ వార్డులోని బొడ్డు భవాని శంకర్ సోదరుడు రాజ కుమారుడు బొడ్డు భార్గవ్ (బన్ను) శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కావ్య క్రిష్ణారెడ్డి ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు... 10వ వార్డులోని వారి నివాసానికి చేరుకొని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు... ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఆత్మకూరు నాగరాజు, ఎస్సీ సెల్ పట్టణ కార్యదర్శి వల్లేరి వెంకట కిరణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi