Thursday, 11 June 2026 08:54:05 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఉదయగిరి నియోజకవర్గంలో ఆగ్రో ఫార్మ్స్ ఏర్పాటుకు పలు ప్రాంతాలను పరిశీలించిన అమెరికా పారిశ్రామికవేత్తలు

Date : 25 November 2024 09:21 AM Views : 769

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఉదయగిరి నియోజకవర్గంలో ఆగ్రో ఫామ్స్ ఏర్పాటుకై అమెరికా పారిశ్రామికవేత్తలు, పలు ప్రాంతాలు పరిశీలన. పారిశ్రామికవేత్తలతో కలసి కామదేను ప్రాజెక్ట్, మరియు పలు పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఆగ్రో ఫామ్స్ కు అనువైన ప్రాంతంగా గుర్తించిన పారిశ్రామికవేత్తలు,విమల్ కుమార్ కొలప్ప, సాయి కిరణ్ కొలవెన్ను కొండాపురం, కలిగిరి: మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిలుపుమేరకు అమెరికాలోని ర్యాలై, నార్త్ కరోలినా, ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు విమల్ కుమార్ కొలప్ప, సాయి కిరణ్ కొలవెన్ను, పెట్టుబడులు పెట్టేందుకు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మరియు నాయకులతో కలిసి ఉదయగిరి నియోజకవర్గం లోని కొండాపురం మండలం మరియు కలిగిరి మండలాల్లో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. వ్యవసాయానికి అనుకూలమైన ఈ ప్రాంతంలో ఆగ్రో ఫామ్స్ ఏర్పాటు చేసేందుకై కొండాపురం మండలం చింతల దేవిలోని కామధేను ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం అదే మండలంలో జంగాలపల్లి గ్రామంలో మెట్ట పంటలైన పొగాకును పరిశీలించారు. రైతులతో కలిసి మాట్లాడారు. అనంతరం కలిగిరి మండలం కమ్మవారిపాలెం లో షీప్ ఫార్మ్ లోని జీవాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వ్యవసాయానికి అనువైన ప్రాంతంగా గుర్తించి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. మెట్ట ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారన్నదానికి ఇదే నిదర్శనం అని సీనియర్ సిటిజన్లు అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :