Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : 10 న జరిగే ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి. వెలిగండ్ల, అమరావతి జ్యోతి మార్చి 8: కనిగిరి నియోజకవర్గం ముదిరాజ్ సోదర సోదరీమణుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం 10-3- 2024 ఆదివారం కపిల లాడ్జ్ ఎదురుగా ఉన్న ఆర్కే గ్రాండ్ రెస్టారెంట్ కనిగిరి నందు సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతున్నదని ఐ టి డి పి కోఆర్డినేటర్ నరేంద్ర ముదిరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అలాగే బీసీ సాధికార సమితి ముదిరాజ్ రాష్ట్ర కన్వీనర్ పి ఎల్ రావు, మరియు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ముదిరాజ్ సంఘం కన్వీనర్ పందిళ్ళపల్లి శ్రీనివాసులు తదితర ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొనుచున్నారు కావున నియోజకవర్గంలోని ముదిరాజ్ సోదర సోదరీమణులందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని నరేంద్ర అన్నారు.
Admin
Amaravathi Jyothi