Amaravathi Jyothi - Andhra Pradesh / అమరావతి : *ఏపీలో ఫించన్‌దారులకు బంపర్ ఆఫర్.. మూడు నెలల పెన్సన్ ఒకేసారి!..* ఏపీ ప్రభుత్వం పింఛనుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇదివరకు ఏ నెల అయిన పింఛను తీసుకోకపోతే వచ్చే నెల ఇచ్చేవారు కాదు. కానీ ఇక నుంచి ఏ నెలలో అయిన పించన్ తీసుకోకపోతే తర్వాత నెలలో రెండు నెలల పెన్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది. మొత్తం మూడు నెలల పెన్సన్ ఒకేసారి తీసుకునే ఛాన్స్ ఇస్తోంది. గతంంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతిని అమలు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీనెల తీసుకోవాలని నిబంధన పెట్టింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో పెన్షన్దారులకు మేలు జరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ప్రతీ నెల వెళ్లి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మూడు నెలలకి ఒకసారి వెళ్లి తీసుకోవచ్చు. దీనివల్ల టికెట్ ఛార్జీలు కూడా వారికి మిగులుతాయి.
Admin
Amaravathi Jyothi