Monday, 20 April 2026 01:40:40 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రాజ్యమేలుతున్న రాజకీయాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

Date : 14 December 2024 06:19 AM Views : 968

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రాజ్యమేలుతున్న రాజకీయాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు పాలకుల స్వలాభం కక్ష సాధింపు వ్యవస్థలో లోపాలు కలగలిసి ఒక బలహీన వర్గాల వ్యక్తిని ప్రేరేపించిన ఆత్మహత్య ముమ్మాటికి హత్య రామాయపట్నం పోర్టుకు మూడు సంవత్సరాల క్రితం తనకున్న మొత్తం భూమిని ప్రభుత్వానికి అందించిన నక్కల వినోద్ బాబు మూడు సంవత్సరాల పరిధిలో మూడు విడతలుగా కొంత భూమికి పరిహారం చెల్లింపు చుక్కల భూముల అంశంలో మొండి చేయి అందరికీ ఒకే నిబంధన వర్తింప చేశారా డిప్యూటీ కలెక్టర్ బాధ్యత మరిచి రాజకీయ పార్టీ కార్యకర్తగా వ్యవహరించారా ? నాటి ప్రజాపతినిధులు చెప్పుడు మాటలు విన్నారా ? ఎవరు ఎన్ని చేసినా బలహీనవర్గాల రైతుకు తీవ్ర అన్యాయం చేశారా? ఆ కుటుంబానికి దిక్కు ఎవరు ? నివాళులర్పించి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే ఇంటూరి భరోసా ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన వామపక్షాలు బలహీనవర్గాల రైతు ఆత్మహత్య అంశంలో ప్రజల నుండి ప్రశ్నల వర్షాలు సమాధానాలు లభించాల్సిందేనంటున్న ప్రజా సంఘాలు నెల్లూరు: కందుకూరు నియోజవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ రైతు నక్కల వినోద్ కుమార్ ఆత్మహత్య సంచలనం రేకెత్తించింది ఆత్మహత్యకు ముందు వినోద్ కుమార్ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మ హత్యకు గల కారణాలు వివరిస్తూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున కావలి పట్టణంలో జరిగింది. ఈ ఆత్మహత్య రాజకీయాల రాజకీయ నాయకులు , నిర్లక్ష్యం వహించే అధికారులు తమ బాధ్యతలు మరిచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కార్యకర్తలుగా వ్యవహరించే కొంతమంది అధికారుల తీరుకు వ్యవస్థలో లోపాలకు నిలువెత్తు వాస్తవ రూపంగా నిలుస్తూ సమాజానికి పలు ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో అంబేద్కర్ అందించిన రాజ్యాంగం నేటికీ రేపటికి ఎన్నటికీ కొంతమందికే ప్రయోజనాలు కల్పిస్తుందా ప్రశ్నించే వారికి బలహీన వర్గాలకు రాజకీయ నాయకుల చెప్పులు మోసే నాయకులకు మాత్రమే వర్తిస్తుందా అనే ప్రశ్నలను కురిపిస్తుందని ప్రజాసంఘాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి .హౄదయ విచారకరమైన ఈ సంఘటన తీరును వినోద్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తే ఈ సమాజం నాగరికతలో ఉందా లేక ఆదిమ రాజ్యంలో ఉందా అనే అనుమానాలు కలగక మానవనే అభిప్రాయాలు అన్ని వర్గాల ప్రజల నుండి వినిపిస్తున్నాయి. చేవూరు గ్రామానికి చెందిన వినోద్ కుమార్ యువకుడైన కొంతమేర రాజకీయాల్లో నాయకులకు అండగా ఉంటూ వచ్చేవారు. ఈ క్రమంలో ఆయన ప్రతిపక్ష పార్టీకి తొలుత మద్దతు తెలిపి ప్రజాపతికి అనుసరిగా గ్రామంలో మాజీ ఎంపీటీసీ కి విధేయుడుగా రాజకీయాల్లో నడిచేవారు ఈ క్రమంలో వినోద్ కుమార్ కు భారీగా అప్పులు మిగిలాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ సమయంలో రామాయపట్నం పోర్టు అభివృద్ధికి తనకున్న మొత్తం భూమిని ఇచ్చేశారు ఈ సమయంలో అతనికి మూడు విడతలుగా కొంతమేర పరిహారం నగదు లభించింది. ఆ నగదును అప్పుల వారికి ఇచ్చినా ఇంకా అప్పులు మిగిలాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు ఎకరాలకు పైగా భూమి పరిహారం అంశంలో చుక్కల భూములు ఉన్నాయని పరిహారం నాటి ప్రభుత్వం ఆదేశించిందని ఇవ్వలేమని ఆ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న పద్మావతి పేర్కొంటుందో అప్పటినుండి రైతు పరిహారం అందుకొని అప్పులు తీర్చాలని ఆశపడిన ఆశ మూడు సంవత్సరాల కాలంలో తీరలేదు. ఇదే సమయంలో గ్రామంలో ఎంపీటీసీకి వినోద్ కుమార్ మధ్య విభేదాలు రావడంతో ఆనాటి ప్రజాపతి ఎంపీటీసీ కి మద్దతు తెలిపారని వినోద్ కుమార్ స్వయంగా తన ఆత్మహత్యకు ముందు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో స్పష్టంగా పేర్కొనటం రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా అనే అభిప్రాయాలు ప్రజల నుండి వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఆయన చంద్రబాబు నాయుడు కనిగిరి వచ్చిన సందర్భంలో టిడిపిలో చేరారు. ఇదే సందర్భంలో సదరు డిప్యూటీ కలెక్టర్ అధికారిగా మరచి తాను ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తగా వ్యవహరిస్తూ పార్టీ మారితే నీకు నగదు వస్తుందా అని బెదిరింపులకు గురి చేసినట్లు వినోద్ కుమార్ సెల్ఫీ వీడియోతో పాటు సూసైడ్ లెటర్ లో స్పష్టంగా పొందుపరచారు. ప్రభుత్వం మారినా అలాంటి అధికారిపై చర్యలు ఎందుకు లేవు ఎవరికి అర్థం కాని బేతాళ ప్రశ్నగా మారిందని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి .ఈ నేపథ్యంలో అప్పులు తీరక గ్రామంలో అప్పులు ఇచ్చిన వారికి కనిపించలేక వినోద్ కుమార్ కావలి పట్టణంలో తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 6 న నేను ఆత్మహత్య చేసుకుంటానని వినోద్ కుమార్ సోషల్ మీడియాద్వారా పత్రికలకు లెటర్ అందించిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పందించి టిడిపి మండల నాయకులతో అతను తొందరపాటు చర్యలు వద్దని న్యాయం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి సమాచారం తీసుకెళ్తానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయినా అవమానాలు భరించలేక అప్పులు తీర్చలేక తన నివాసంలో వినోద్ కుమార్ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడి అందరికీ ఆవేదన మిగిల్చాడు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు ఉద్యమిచ్చి తన సమస్యను పరిష్కరించుకోవాల్సిన యువకుడైన వినోద్ కుమార్ తొందరపాటు చర్యతో ఆత్మహత్యకు పాల్పడటం సమాజానికి బాధ కలిగించింది. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వామపక్షాలు వినోద్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలను విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండు చేశాయి. అనంతరం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో వినోద్ కుమార్ కు పరిహారం రావాల్సిందిఎంత మిగిలిన దానికి ఎంత రావాలి అన్న రికార్డులు బయటకు తీస్తున్నారు .మరోవైపు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు చుక్కల భూములు పరిహారం ఒక్క వినోద్ కుమార్ కే రాలేదా ఎంత మందికి వచ్చాయో లెక్క తేల్చాల్సిందేనని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినోద్ కుమార్ బలిదానం అందిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంపై అతనిని మానసిక వేదనకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన ప్రతి ఒక్కరిపై చట్టపకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :