Saturday, 12 September 2026 08:27:57 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఎస్మా జి ఓ ప్రతులు బోగి మంటల్లో దగ్ధం

Date : 14 January 2024 05:42 PM Views : 259

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఎస్మా జి ఓ ప్రతులు బోగిమంటల్లో దగ్ధం చేసి, పండగ రోజు కూడా శిబిరాల్లోనే అంగన్వాడిలు. ఉలవపాడు,అమరావతి జ్యోతి: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందని, అయితే ఎస్మా కు ఏమాత్రం భయపడబోమని, సమ్మె శిబిరాల్లోనే భోగిమంటల్లో ఎస్మాప్రతులను దగ్ధం చేసి తమ నిరసనను తెలిపారు. జగనన్నకు మనసు మారాలి -మా అంగన్వాడీల వేతనాలు పెంచాలి అంటూ ముగ్గులు వేసి వ్రాశారు. ఐసిడిఎస్ ఉలవపాడు ప్రాజెక్టు వద్ద 34 వ రోజులో భాగంగా భోగి పండుగనాడు అంగన్వాడీల సమ్మె శిబిరం కొనసాగింది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ శిబిరంలో చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా నాయకులు జివిబి కుమార్ మాట్లాడుతూ సమ్మె పరిష్కారం కానట్లయితే సంక్రాంతి పండుగ అనంతరం సీఎం ఇంటి ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలకు చాలీచాలని వేతనాలు ఇస్తూ వెట్టి చాకిరి చేయించుకుంటుందని వారికి కనీస వేతనాలు ఇవ్వట్లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలను చిన్నచూపు చూస్తుందని పేర్కొన్నారు. సమ్మె పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఏ.పీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఉలవపాడు ప్రాజెక్టు అధ్యక్షులు సిహెచ్ ఇందిరావతి, అంగన్వాడీ యూనియన్ నాయకులు కత్తి బుజ్జమ్మ,కే. కోటేశ్వరి,డి. వెంకటరమణమ్మ, సుస్మిత,సునీత,మల్లేశ్వరి, వాయాల జానకి,కే.సుశీల, వి కృష్ణవేణి,బి.ఆదిలక్ష్మి,వి.మంగమ్మ తదితరులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :