Monday, 02 March 2026 12:14:29 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

వైసీపీ ప్రభుత్వంలో టీచర్లకు అన్ని అవమానాలే సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేదు

Date : 07 December 2025 08:39 PM Views : 214

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: యువ నాయకులు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, ఆ వ్యవస్థకు మంచి రోజులు వచ్చాయని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం కందుకూరులో జరిగిన యుటిఎఫ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించిన నాగేశ్వరరావు, మిగిలిన సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల అత్యంత అవమానకరంగా వ్యవహరించేవారని అన్నారు. మద్యంషాపుల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, కనీసం జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని అన్నారు. ఉపాధ్యాయులు ప్రతినెలా దాచుకున్న సొమ్మును కూడా తీసుకోలేని దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రశ్నించిన ఉపాధ్యాయులను అడుగడుగునా అణగదొక్కేందుకు ప్రయత్నించారని, చివరికి కేసులు అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని, ప్రతినెల 1వ తేదీనే జీతాలు అందుకుంటున్నారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. ఎమ్మెల్యేల జోక్యం లేకుండా పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించారని గుర్తుచేశారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయడమే కాక, ఇకనుంచి ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు విద్యార్థులు క్యూ కట్టేలా లోకేష్ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు.ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో, విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు. గత ఎన్నికల్లో ఉపాధ్యాయులు తనకు ఎంతగానో మద్దతు ఇచ్చారని, ఉపాధ్యాయులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వారికి హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. చివరగా ఉపాధ్యాయులంతా కలిసి ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిలారి వెంకటేశ్వర్లు సీనియర్ కార్యకర్త ముప్పరాజు కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పొన్నగంటి వెంకటేశ్వర్లు కందుకూరు యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దామా కొండప నాయుడు చిత్తారు వెంకటేశ్వర్లు గుడ్లూరు మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మక్కెన రమేష్ బాబు, మనోహరం వివి పాలెం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మనం మాధవరావు, ఎం హనుమంతరావు, పొన్నలూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగసముద్రం హైస్కూల్ హెడ్మాస్టర్ కే మాధవరావు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :