Monday, 02 March 2026 12:18:54 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే ఇంటూరి

నిర్వాహకులకు అభినందనలు

Date : 23 November 2025 09:06 PM Views : 321

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో KVSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన కూనం వెంకటసుబ్బారెడ్డి 14 వ వర్ధంతి, వారి కుమారుడు అనిల్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కూనం సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం 14 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా వైద్య శిబిరాలతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ప్రజలంతా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారని తెలిపారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ కూనం అనిల్ రెడ్డి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా చేపట్టాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులు, సొంత గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందన్నారు. కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కొనియాడారు. రామకృష్ణాపురం గ్రామం వద్ద పొలాల్లోకి వెళ్లే చప్టా దెబ్బతినడంతో రైతులకు ఇబ్బందిగా మారిందని, ఆ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకు వెళ్ళగానే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి 40 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. చెమిడిదపాడు గ్రామ సమీపంలో చెరువుఅలుగు నీరు ప్రవహించే టప్పుడల్లా రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అక్కడ కూడా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ గారు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే బద్దిపూడి నుంచి మాచవరం వెళ్లే దారిలో ఇలాంటి సమస్య ఉందని సభాముఖంగా ఎమ్మెల్యే విన్నవించగా, అక్కడ కూడా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు తప్పక కేటాయిస్తానని ఎంపీ వేమిరెడ్డి హామీ ఇవ్వడంతో ప్రజలంతా చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు.ముందుగా ఈ ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమానికి వచ్చిన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు..ఈ సందర్భంగా సొంత గ్రామంలో ప్రజల కొరకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన కూనం రాఘవరెడ్డి మరియు బ్రహ్మానందరెడ్డి లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.. ముందుగా ఈ ఉచిత వైద్య శిబిరంలో వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు ప్రముఖ వైద్యులు డాక్టర్ కే సీతారామయ్య మరియు డాక్టర్ కే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 15 మంది స్పెషలిస్ట్ డాక్టర్లచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేయడం జరిగిందని ఉచిత మెడికల్ క్యాంప్ డాక్టర్లు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో వరంగల్ మాజీ శాసనసభ్యులు శ్రీధర్ బాబు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, సూర్య ప్రకాష్ రెడ్డి పార్టీ నాయకులు అంకమ్మరాజు, ఆదినారాయణ కూనం తాతిరెడ్డి, తిరుపతిరెడ్డి మండలంలోని గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.. .

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :