Friday, 17 April 2026 07:01:38 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

బహుమతులు అందజేసిన పూసపాటి వెంకటేశ్వరరాజు

Date : 16 January 2026 10:52 PM Views : 654

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : గుడ్లూరు: మండలంలోని పోట్లూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇన్ఫినిటీ డెవలపర్స్ ఎండి పూసపాటి వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. పూసపాటి వెంకటేశ్వరరాజు, గృహ నిర్మాణ శాఖ డి ఈ నారాయణరెడ్డి,ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలతో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. పండుగ సంబరాల్లో భాగంగా పోట్లూరులో ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. పూసపాటి వెంకటేశ్వర రాజు, కంపరాజు రామరాజు, చిరువెళ్ల రోసిరాజు, పూసపాటి చందు వర్మ పాల్గొని ప్రతి ముగ్గును పరిశీలించి, మహిళలను పేరుపేరునా పలకరిస్తూ అభినందించారు. వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు జరగడంతో పోట్లూరు గ్రామం కళకళలాడింది. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా బి వెంకటేశ్వరమ్మ కు 5116 రూపాయలు నగదు బహుమతి, రెండవ బహుమతిగా చిరువెళ్ళ పార్వతికి మిక్సర్, మూడవ బహుమతిగా కర్పూరపు పావనికి రైస్ కుక్కర్, నాలుగవ బహుమతిగా చిరువెళ్ళ అంజమ్మకు ఐరన్ బాక్స్, ఐదవ బహుమతిగా అడవిరాజు పూజిత కు 516 రూపాయలు నగదు బహుమతి అందజేశారు. వీరితోపాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డి ఈ నారాయణరెడ్డి మాట్లాడుతూ పూసపాటి వెంకటేశ్వరరాజు చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం గృహ నిర్మాణ శాఖ ఏఈ నాగరాజు, పోట్లూరు గ్రామ యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :