Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : కొండపి :బాలికపై వారం రోజులుగా లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ప్రకాశం జిల్లా కొండపి మండలంలో ఆలస్యంగా బయటపడింది. నిందితుడు తన 12 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో కడుపు నొప్పితో బాధపడుతున్న కుమార్తెను తల్లి నిన్న హాస్పిటల్ కి తీసుకెళ్లింది. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. తల్లి వారి కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో కన్న తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాలిక చెప్పినట్టు సమాచారం.కొండపి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తండ్రి రూపంలో ఉన్న మానవ మృగాన్ని ఉరి తీయాలని కోరుతున్నారు.
Admin
Amaravathi Jyothi