Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు ఖ్యాతిని నిలబెట్టిన మృదుల.. కందుకూరు, అమరావతి జ్యోతి: నందమూరి తారక రామారావు కళాక్షేత్రం అనంతపురం నందు జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నిర్వహించిన 13వ స్నాతకోత్సవం లోకందుకూరుకు చెందిన యర్రా ముసలయ్య కుమార్తె మృదుల అపార ప్రతిభ కనపరిచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో శ్రీ వెంకటేశ్వర కాలేజీస్ ఆఫ్ ఇంజనీరింగ్ (తిరుపతి). (జె ఎన్ టి యు) అనంతపురం స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించడంతో ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదగా గోల్డ్ మెడల్ మరియు ప్రశంసాపత్రం ,పట్టా అందుకున్నారు ఈ సందర్భంగా సామాన్య కుటుంబంలో జన్మించి అపార ప్రతిభ కనబరిచి కందుకూరు ప్రజలకు కొంత ఆదర్శప్రాయంగా నిలబడిన మృదులను కుటుంబ సభ్యులు మరియు విద్యావంతులు అభినందించారు
Admin
Amaravathi Jyothi