Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తెలుగుదేశం పార్టీలో చేరిన 12 కుటుంబాలు ఉలవపాడు అమరావతి జ్యోతి: ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని పెద్దపల్లెపాలెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు, ఆదివారం వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన తంబు శీను, వల్లభోని మల్లికార్జున, వల్లభోని వెంకటేశ్వర్లు, కొక్కిలిగడ్డ ప్రసాద్, కొక్కిలిగడ్డ వెంకట్రావు, కొక్కిలిగడ్డ కృష్ణారావు, నాయుడు రాజు, నాయుడు రాము, నాయుడు లక్ష్మణ్, నాయుడు సురేష్, పల్లెపాటి బాబులు, వల్లభోని నరసింహారావు లు పార్టీలో చేరగా... నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ, కొత్తగా వచ్చిన వారికి పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తూ.... పాత, కొత్త నాయకులు అందరు కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. త్వరలోనే కందుకూరు నియోజకవర్గం నుంచి పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గాలను చూడలేక, వైసీపీ నుంచి అనేకమంది బయటికి వస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గ పరిశీలకులు కె . కుసుమకుమారి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నాగేశ్వరరావు విజయానికి అందరూ కలిసి కృషి చేయాలని తెలిపారు..పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ని చూసుకొని వారి అనుచరులు దోపిడీలకు అడ్డులేకుండా పోయిందని, తమ పంట పొలాలకు సంభందించిన రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి తమను ఇబ్బంది పెడుతున్నారని, గ్రామాల్లో ఘర్షణ వాతావరణం సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దానికి నిరసనగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు గొల్లపోతు యానాది, అమనగిరి వెంకటనారాయణ, కొక్కిలిగడ్డ సుబ్బయ్య, తంబు యానాది, వల్లభోని యానాది కోప్పాడి స్వాములు, గొల్లపోతు సుబ్రహ్మణ్యం, రాచగర్ల శివకుమార్, అమ్మనబ్రోలు శ్రీనివాసులు ఇతర నాయకులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi