Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రీసెర్చ్ సెంటర్ ల ఏర్పాటు కందుకూరు, అమరావతి జ్యోతి: టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలో రీసెర్చ్ సెంటర్లను కేటాయించినట్లు కళాశాల ప్రిన్సిపల్, డా.యం. రవి కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫిజిక్స్, లైఫ్ సైన్సెస్, ఇంగ్లీష్, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లలో రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుచేసి, అందులో పనిచేస్తున్న డాక్టరేట్ అధ్యాపకులను రీసెర్చ్ గైడ్ లుగా గుర్తించారు. ఇటీవలే ఇతర యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్ల బృందం కళాశాలను సందర్శించి, డిపార్ట్మెంట్ లలోని మౌలిక వసతులను పరిశీలించి, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వారికి నివేదిక అందజేశారు. టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూనివర్శిటీ పరిధిలోనే అత్యధిక సంఖ్యలో 16 మంది డాక్టరేట్ అధ్యాపకులు ఉన్నారు. రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుతో పరిశోధనలు ఊపందు కొంటాయి. గత 6 సం.ల కాలం లో కళాశాల అధ్యాపకులు 100 కి పైగా రీసెర్చ్ పేపర్లను(పరిశోధనా పత్రాలను) వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్లలో ముద్రించబడ్డాయి. ఏపీ ఆర్ సెట్(APRCET )లో క్వాలిఫై అయిన అభ్యర్థులను పీ.హెచ్.డీ.కోసం పైన పేర్కొన్న సబ్జెక్టు లందు కేటాయిస్తారు.
Admin
Amaravathi Jyothi