Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వైసీపీ మాజీ కౌన్సిలర్ మొలతాటి శేషమ్మ టీడీపీ లో చేరిక - 10, 11వార్డుల నుండి టీడీపీ లోకి భారీ చేరికలు - వైసీపీ నుండి టీడీపీ కి భారీగా తరలివచ్చిన నేతలు - మాట మీద నిలబడే, నమ్మకమైన వ్యక్తి కావ్య క్రిష్ణారెడ్డికే మద్దతు అంటున్న ప్రజలు కావలి,అమరావతి జ్యోతి :కావలి బాగుపడాలంటే కావ్య రావాలని అంటున్న ప్రజలు కావలి పట్టణంలోని 10వ వార్డు, 11వ వార్డు నుండి భారీ స్థాయిలో వైసీపీ నుండి టీడీపీ లోకి చేరికలు జరిగాయి.. ఆదివారం కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 11వ వార్డు వైసీపీ మాజీ కౌన్సిలర్ మొలతాటి శేషమ్మ, ఎస్సీ ఫిషర్ మెన్ సొసైటీ చైర్మన్ ఎల్లంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కావలి పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, ఆత్మకూరు నాగరాజు, మేడికొండ సుకుమార్ సమక్షంలో బొడ్డు వెంకట నారాయణ, మొలతాటి మనోహర్, మార్పుడి మాచర్ల, పిసి రామారావు, తదితరులు పెద్ద ఎత్తున వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. వీరికి తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డిపార్టీ కండువాలు కప్పి సాధరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.. *అనంతరం కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ* నన్ను నమ్మి ఊళ్లకు ఊళ్ళు, వార్డులకు వార్డుల ప్రజలు మద్దతు తెలపడమే కాకుండా, వెంట నడుస్తామంటూ తెలుగుదేశం పార్టీ లో చేరి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి నన్ను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.. అభివృద్ధి కుంటు పడిన కావలిలో అభివృద్ధి చేసి చూపెడతానని, నన్ను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని అన్నారు.. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ* అభివృద్ధి చేయగల, మాట మీద నిలబడే నమ్మకమైన వ్యక్తి కావ్య క్రిష్ణారెడ్డి అని, కావలి బాగు పడాలంటే, కావలి లో ప్రశాంత వాతావరణం రావాలంటే, దోపిడీలు, ఆరాచకాలకు అడ్డుకట్ట పడాలంటే ఎమ్మెల్యేగా కావ్య క్రిష్ణారెడ్డిని గెలిపించుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...
Admin
Amaravathi Jyothi