Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : రాష్ట్ర భవిష్యత్ ను గురువులు గుర్తించాలి . రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. యువతకు జాబు రావాలంటే బాబు రావాలి.. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. కావలి,అమరావతి జ్యోతి: వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం ఎలా ఉంది. మరలా వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ ఏమిటో గురువులు గుర్తించాలని ఉదయగిరి టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.ఆదివారం కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కల్యాణ మండపంలో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని ప్రైవేట్ పాఠశాలల, కాలేజీల ఉపాధ్యాయులు, అధ్యాపకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విద్యార్థులను భవిష్యత్ ను తీర్చిదిద్దే, సమాజ హితం కోరే ఉపాధ్యాయులు, అధ్యాపకులు విజ్ఞత తో అలోచించి ఓటు వేయాలని, చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న, యువతకు ఉపాధి రావాలన్న చంద్రబాబు రావాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi