Thursday, 11 June 2026 08:54:05 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సమ్మెబాట పట్టిన అంగన్వాడీలు

Date : 13 December 2023 06:35 AM Views : 303

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : సమ్మెబాట పట్టిన అంగన్వాడీలు వెలిగండ్ల,అమరావతి జ్యోతి: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం దాటిన ఇంతవరకు అంగన్వాడీల పట్ల ఎలాంటి కనికరం చూపకుండా ఉన్నారని ఎలాగైనా ఈ ప్రభుత్వం మెడలు వంచి డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 12 నుంచి సమ్మెబాట పట్టడం జరిగిందని దీనిలో భాగంగా మంగళవారం నాడు అంగన్వాడి ప్రాజెక్టు స్థాయిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు,ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను కొనసాగించడం జరిగినది. డిసెంబర్ 12వ తేదీ నుంచి అంగన్వాడి స్కూల్స్ పూర్తిగా మూసివేసి ప్రాజెక్టు స్థాయిలో జరిగే ఈ సమ్మెలో పాల్గొనాలని అంగన్వాడీ యూనియన్ నాయకులు ముక్కు మహాలక్ష్మమ్మ, మరియు జిల్లా సిఐటియు నాయకులు రాయల మాలకొండయ్య పిలుపునివ్వడం జరిగినది. ఈ సందర్భంగా రాయల మాలకొండ మాట్లాడుతూ, అంగన్వాడీల డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు కేంద్రాలు తెరిచే ప్రసక్తేలేదని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగినది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల వారి యొక్క హక్కులను కాలరాస్తూ వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా వేతనం ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగిందని ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మోసం చేయడం జరిగిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం గ్రాడ్యుటి కనీస వేతనం నెలకు 26వేల రూపాయలు ఇవ్వాలని మినీ సెంటర్స్ ను మెయిన్ సెంటర్ గా మార్పు చేసి అంతవరకు మినీ వర్కర్స్ కు మెయిన్ సెంటర్స్ కి ఇస్తున్నటువంటి వేతనం ఇవ్వాలని అలాగే రిటర్మెంట్ బెనిఫిట్స్ను ఐదు లక్షల వరకు పెంచి వేతనంలో సగం పెన్షన్ గా ఇవ్వాలన్నారు. సకాలంలో సెంటర్స్కు ఫుడ్ సరఫరా చేయాలని 2017 నుండి పెండింగ్ లో ఉన్న టిఏ బకాయిలు ఇతర బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఐసిడిఎస్ కు రాబోయే బడ్జెట్లో నిధులు పెంచాలని రిటర్మెంట్ వయసును 62 సంవత్సరముల వరకు పొడిగించాలని ఈ డిమాండ్స్ ని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని లేనిపక్షంలో నిరవధికంగా కొనసాగిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం భారీగా ర్యాలీతో ఐసిడిఎస్ ప్రాజెక్టు నుండి వెలిగండ్ల బస్టాండ్ సెంటర్ వరకు టీచర్స్ మరియు ఆయాలు కలిసి నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ముక్కు మహాలక్ష్మి, సెక్టార్ లీడర్లు రఫియా, ఝాన్సీ, సౌజన్య, సలోమి, తిరుపతమ్మ ,ఆదిలక్ష్మి, రాయల రమాదేవి తదితర టీచర్లు ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :