Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వైభవంగా హనుమత్ వ్రతం కందుకూరు: స్థానిక జనార్ధన స్వామి ఆలయంలో హనుమద్ దీక్షా పరులు అత్యంత వైభవంగా హనుమత్ వ్రతం నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి ఆలయ ఆవరణ భక్తులతో కోలాహలంగా ఉంది. ముందుగా వాలాగ్రా ఆంజనేయస్వామి పూజ పూర్తి చేసుకుని అనంతరం హనుమత్ వ్రతంలో పాల్గొన్నారు. సువర్చల ఆంజనేయ స్వాములను శ్రీరామనామం చేస్తూ వ్రతస్థలికి తీసుకుని వచ్చారు. వేద పండితులు కిషోర్, కళ్యాణ్ చక్రవర్తి ఇరువురు ఘనంగా వ్రతం నిర్వహించారు. అనంతరం వ్రత హోమం నిర్వహించి భక్తులతో మంత్ర జపం చేపించారు. దీక్షాపరులకు వ్రతానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ శరణ్ హనుమత్ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హనుమత్ ప్రసాద్ గురువుగారు, గురుస్వామి నాగినేని కోటేశ్వరరావు, చిమ్మిడదపాడు హనుమాన్ ట్రస్ట్ అధ్యక్షుడు ఏవి హనుమంతరావు, ఈ సామూహిక వ్రతంలో హనుమదీక్షాపరులతో పాటు హనుమత్ భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెన్నుపాడు, టంగుటూరు, ఎనికపాడు, గుడ్లూరు, చిమిడిదపాడుకు సంబంధించిన దీక్ష పరులు భక్తులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi