Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మాయదారి జగన్ మనకొద్దు బాబును తెచ్చుకుందాం.. బాగుపడదాం లింగసముద్రం: అమరావతి జ్యోతి: రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళుతున్న జగన్మోహన్ రెడ్డి మనకు వద్దని, ముందు చూపుతో అభివృద్ధి చేయగల సత్తా ఉన్న చంద్రబాబు నాయుడుని మళ్లీ ముఖ్యమంత్రిగా తెచ్చుకుందామని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని లింగసముద్రం పంచాయతీలోని జంపాలవారిపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు, మండల పార్టీ అధ్యక్షుడు వేముల గోపాలరావు, ఇతర నాయకులు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇస్తే, అభివృద్ధి చేయకపోగా రాష్ట్రాన్ని పాతికేళ్ళు వెనక్కి తీసుకువెళ్లాడని విమర్శించారు. అప్పు తీసుకురానిదే పూట గడవని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, వీలుంటే ప్రజలను కూడా తాకట్టు పెట్టగల దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఓడిపోతామని ముందే తెలిసిపోయి, టిక్కెట్ల పేరుతో కలెక్షన్లు మొదలుపెట్టాడని అన్నారు. ఎంత డబ్బు వెదజల్లినా, ఎన్ని మోసపు మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కందుకూరు నియోజకవర్గంను నెల్లూరు జిల్లాలో కలిపి అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఈ ప్రాంత ప్రజానీకానికి తీరని ద్రోహం చేశారని నాగేశ్వరరావు విమర్శించారు. రాళ్లపాడు రిజర్వాయర్ కు దక్కాల్సిన సోమశిల నీటిని కూడా తీసుకురాలేక పోయారని అన్నారు. రాళ్లపాడు ఎడమ కాలువ కోసం గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పాతిక కోట్లు ఏమయ్యాయని, కల్లిబొల్లి మాటలతో ప్రజలను ఎంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ప్రజలంతా వైసీపీ నేతల కుట్రలను గమనించాలని నాగేశ్వరరావు కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు నాయుడు అమలు చేయడం ఖాయమని, ముఖ్యంగా మహిళలు, యువత, రైతులకు అన్ని విధాలుగా మేలు జరిగేలా పథకాలు అమలు చేస్తారని నాగేశ్వరరావు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించాలని నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు, జనసేన మండల కన్వీనర్ అంగులూరి నరసింహారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్ , స్థానిక నాయకులు జంపాల మహేష్, మక్కెన వెంకటేశ్వర్లు, తోపు నరసింహం, జంపాల శివ, జంపాల కృష్ణయ్య, మక్కెన వెంకటేశ్వర్లు, పాండ్ర హరి, మార్తాటి రవి, మండల తెలుగు యువత అధ్యక్షులు అడపా రంగయ్య, విశ్వనాధపురం సర్పంచ్ బొల్లినేని నాగేశ్వరరావు, మండల తెలుగు రైతు HBఅధ్యక్షులు మద్దెల రామారావు, నాయకులు అడపా నరసయ్య, బింకం శేషయ్య, అర్దాకుల పెద్దసత్యం, దేవకి సుబ్రహ్మణ్యం, మక్కెన మల్లికార్జున, ఉప్పు శ్రీను, తమ్మిశెట్టి సుబ్బరాయుడు, తాళ్లూరి ముసలయ్య, చిరుతోటి బాలకోటయ్య, బ్రహ్మారెడ్డి, పెద్దిరెడ్డి, నాగిరెడ్డి, నాగిరెడ్డి, కిలారి రమణయ్య, కిలారి కొండయ్య, గొల్లపల్లి వెంకటేశ్వర్లు, రవీంద్ర, సోంపల్లి మనోహర్, గొర్రెపాటి సాంబయ్య, మోతుకూరి పర్వతాలు, ముప్పరాజు వెంకటేశ్వర్లు, మాల్యాద్రి, బండ్లమూడి రామయ్య, ఉట్లపల్లి మాధవరావు, నారిబోయిన నారాయణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు...
Admin
Amaravathi Jyothi