Thursday, 11 June 2026 10:07:36 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కార్తీక్ పౌండేషన్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అద్భుతం వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు

Date : 07 September 2024 10:33 PM Views : 689

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వేమూరు, అమరావతి జ్యోతి: విపత్తు కష్టకాలంలో సమాజానికి కార్తీక్ ఫౌండేషన్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అద్భుతమని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు భట్టిప్రోలు మండల్లాల్లో పోతర్లాంక, పెద్దలంక మధ్యగూడెం చింతమోటు గ్రామాల్లో వరద ముంపుకు గురై ఎంతో మంది నిరాశ్రాయులై కట్టుబట్టలతో పునరావాస కేంద్రానికి రావడం జరిగింది. విపత్తులో ఉన్న వరదబాధితులకు వేమూరు మండలం కోడిపర్రు గ్రామానికి చెందిన కార్తీక్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార పదార్దాలు అందించడం జరిగింది. ఈ సందర్బంగా వేమూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ విపత్తు సమయంలో కష్టకాలంలో ప్రజలకు మానవత్వంతో నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న కార్తీక్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నండూరి కార్తీక్ సామాజిక స్ఫూర్తికి నిదర్శనమని అయన అన్నారు. పకృతి విలయతాండవం వలన ప్రజలు సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి పరిస్థితులలో మనమంతా సామజిక బాధ్యతతో సహాయం చేయవలసిన అవసరం ఉందని ఆనంద బాబు అన్నారు. కార్తీక్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్దులకు, దివ్యాంగులకు, పేదలకు, వితంతువులకు, విద్యార్థులకు, అద్భుతమైన సేవలు చేస్తున్నారని అనాధలకు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా విద్యా, వైద్య రవాణా భోజన సౌకర్యాలుఅందించడం జరుగుతుందని ఇలాంటి గొప్ప సేవలు ఒక సామాన్యమైన వ్యక్తి డాక్టర్ నండూరి కార్తీక్ చేయడం ఎక్కడ చూడలేదని ముఖ్యంగా కరోనా క్లిష్టమైనా పరిస్థితులలో వేలాదిమందికి గొప్ప సేవలు చేసే ఘనత కార్తీక్ ఫౌండేషన్ కి చెందుతుందని ఆనంద బాబు తెలిపారు. విపత్తులో ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తున్న కార్తీక్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నండూరి కార్తీక్ సేవలను ఆనంద బాబు ప్రశంసించారు. మాజీ ఎం.పీ.పీ కనగల మధుసూదన్ మాట్లాడుతూ ఈ సమాజం కష్టకాలంలో ఉందంటే ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని మధుసూదన్ పిలిపునిచ్చారు. ఈ సమాజానికి మా సోదరులు డాక్టర్ నండూరి కార్తీక్ చేస్తున్న సేవలకు మాటలు చాలవని, భవిష్యత్తులోభగవంతుని ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చెయ్యాలని మధుసూదన్ ఆకాంక్షించారు. కార్తీక్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కష్టకాలంలో ఉన్న వరద బాధితులకు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు, మాజీ ఎంపీపీ మధుసూదన్ డాక్టర్ నండూరి కార్తీక్ కు సంస్థ సభ్యులకు అభినందనలు తెలిపారు. వరద బాధితులకు సేస్తున్న సేవా కార్యక్రమాల్లో నండూరి సుమన్, చావలి సుందర్,ఆళ్లమూడి భారత్, తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :