Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఆర్యవైశ్యుల ద్రోహి వెల్లంపల్లి ---- కావలి టిడిపి ఆర్యవైశ్య నేతలు కావలి, అమరావతి జ్యోతి : గురువారం రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆదేశానుసారం టిడిపి కార్యాలయం నందు ఆర్యవైశ్య నేతల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య,చవ్వల రామకృష్ణ,బోగ్గవరపు శ్రీనివాసులు,కోట రమేష్ లు మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ కు ప్రతిసవాల్ విసిరిన టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డైనమిక్ ఆర్య వైశ్య లీడర్ "డూండి రాకేష్" కి మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేశామని, ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో చర్చకు రావాలన్న వెల్లంపల్లికి కనీస జ్ఞానం లేదన్నారు. కార్తీక మాసంలో వన సమారాధనకు భూమి పూజ చేస్తే దానిని అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు ?డిసెంబర్ 3న విజయవాడ కన్యకాపరమేశ్వరి ఆలయంలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తోందని, ఆర్యవైశ్యులపై జరుగుతున్న కక్షసాధింపు ధోరణి పై విరుచుకుపడ్డారు. ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, కులం పేరుతో అంచలంచెలుగా ఎదిగిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈరోజు మంత్రి పదవికి కళంకం తెచ్చారని, గడచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఆర్యవైశ్యులపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడులు అందరికీ తెలుసని, ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే స్థాయి వెల్లంపల్లికి లేదని ఖండించారు.ఇప్పటికైనా వైసిపి ఆర్య వైశ్య నాయకులు సవాళ్లు చేయడం మాని, విజ్ఞతతో ఆర్యవైశ్యులకు మంచి చేయాలని హితవు పలికారు. నిజంగా రాష్ట్రం లో ఆర్య వైశ్యుల మీద దాడులు ఎన్ని జరిగాయో మీకు గుర్తు లేవా, ఎన్ని ప్రాణాలు బలి కొన్నారో తెలియదా, వాసవి సత్రాలు, వాసవి అమ్మవారి గుడిలను అక్రమంగా ధ్వంసం చేయడం తెలియదా, తెలంగాణలో ఉన్న మన వాసవి సత్రాల ఆస్తులు కాపాడడం చేతకాదు కానీసవాల్ చేయడం సిగ్గు లేకుండా మాట్లాడం హెమమైన చర్య అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ చవల మురళి, తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య నాయకులు చవల రామకృష్ణ, పోతుగంటి శ్రీకాంత్, కటకం రాము, వాయుగుండ్ల వెంకటేశ్వర్లు, అచ్యుత శ్రీకాంత్, నటుకుల వెంకట సురేష్, ఇడిముక్కల పవన్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi