Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వైభవంగా నక్షత్ర ఐఐటి జేఈఈ అకాడమీ ఫేర్వెల్ వేడుకలు కందుకూరు, అమరావతి జ్యోతి:నక్షత్ర ఐఐటి జేఈఈ అకాడమీ వారి ఫేర్ వెల్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మంచి ఫలితాలు సాధించిందని నక్షత్ర కళాశాల యాజమాన్యం సేవలను,కృషిని కొనియాడారు. ఆటల పోటీలతో పాటు పలు విభాగాలలో రాణించిన విద్యార్థులకు ఎంఈఓ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు డాన్సులు మిమిక్రీలతో చేసిన విన్యాసాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య డైరెక్టర్ శ్రీనివాస్, ప్రత్యేక అతిధులు శివ సాయి స్కూల్ అధినేత ఓరుగంటి శివరామయ్య, వలేటి రవి, విద్యార్ధిని, విద్యార్థులు వారి తల్లితండ్రులు , కళాశాలలో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi