Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణంలో 5వ వార్డుకు చెందిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు చనమాల శ్రీధర్, 18 వ వార్డుకు చెందిన సయ్యద్ మూస ఆధ్వర్యంలో 33 కుటుంబాల వారు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నా గెలుపు కోసం కృషి చేసిన నాయకులను, కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోనని ఎమ్మెల్యే తెలియజేశారు..ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాత మరియు కొత్త నాయకులందరం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే తెలిపారు..24 x 7 ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు..అనంతరం సయ్యద్ మూస ఆధ్వర్యంలో గజమాలతో ఎమ్మెల్యేని సత్కరించారు..ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గెలిచినప్పటినుంచి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసే ఇంటూరి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పనిచేయటానికి తామంతా వైసిపి పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరామని వారు తెలిపారు..ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, రాష్ట్ర ముస్లిం మైనార్టీ అధికార ప్రతిదీ షేక్ రఫీ, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పులి నాగరాజు, పార్టీ నాయకులు పొడపాటి నరసింహం, శ్యామ్, నూకతోటి క్రాంతి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi