Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తారక రత్నకు నివాళులు అర్పించిన కావ్య క్రిష్ణారెడ్డి కావలి,అమరావతి జ్యోతి: కీర్తి శేషులు నందమూరి తారకరత్న ప్రధమ వర్ధంతి సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి టీడీపీ పార్టీ ఇంచార్జ్ కావ్య క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తారక రత్నకి నివాళులు అర్పించారు.. తారక రత్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వెంట నడచి, ఆయన సిద్ధాంతాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో అకాల మరణం చెందడం బాధాకరం అన్నారు.. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కూడా నడుం బిగించి కష్టపడ్డారన్నారు.. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు...
Admin
Amaravathi Jyothi