Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జనసేన కార్యాలయానికి విచ్చేసిన కావ్య క్రిష్ణారెడ్డి ఎన్నికల ప్రణాళిక పై ఇరువురు కాసేపు చర్చ భారీ మెజారిటీతో టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ని గెలిపించుకుంటామన్న అలహరి సుధాకర్ బాగుంది అమరావతి జ్యోతి: కావలి తెలుగుదేశం పార్టీ- జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి శనివారం జనసేన కార్యాలయానికి విచ్చేశారు.. జనసేన కావలి ఇంచార్జి అలహరి సుధాకర్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.. అలహరి సుధాకర్ కావ్య క్రిష్ణారెడ్డి ని ఆప్యాయంగా పలకరించి స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల ప్రణాళిక పై ఇరువురు కాసేపు చర్చించారు.. కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ* నాకు టికెట్ లభించిన అనంతరం జనసేన ఇంచార్జి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందన్నారు. కావలిలో టీడీపీ - జనసేన అభ్యర్థిగా నియమించిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ధన్యవాదములు తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు కలిసి పనిచేసే విధంగా, జనసేన ఇంచార్జి సూచనలు పాటిస్తూ పనిచేయడం జరుగుతుందన్నారు. టీడీపీ - జనసేన ఒక్కటే అనే విధంగా కలిసి పని చేస్తామని తెలిపారు.. అలహారి సుధాకర్ మాట్లాడుతూ... టీడీపీ - జనసేన ఉమ్మడి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని తెలిపారు.. కావ్య క్రిష్ణారెడ్డితో పరిచయం కోసం త్వరలో జనసేన నాయకులు, జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలాంటి మనస్పర్థలు లేకుండా పనిచేసి ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుంటామన్నారు.. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi