Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు గ్రామ దేవత ఆదిపరాశక్తి శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా సుమారు 6 కోట్ల రూపాయలతో జీర్ణోద్ధరణ జరిగింది. ఆలయం ముందు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించే అనివేటి మండపానికి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. హైదరాబాదులో నివసిస్తున్న ఎస్ ఎస్ వి కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు ముప్పరాజు శ్రీను, దివి వసంత కుమార్ లు కందుకూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు చేతులమీదుగా రూ.1,01,116 కానుకగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి కి అందజేశారు. అలాగే కిలారి శ్రీనివాసులు ధర్మపత్ని సులోచన కుమారుడు తిరుమలేష్ బాబు రూ. 25,116 రూపాయలు కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, ఆవుల మాధవరావు, గాండ్ల శ్రీనివానులకు అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు.
Admin
Amaravathi Jyothi