Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పాతూరు నుండి భారీగా చేరికలు -ముఖ్య నాయకులు వైసీపీ ని వీడి తెలుగుదేశంలోకి కావలి,అమరావతి జ్యోతి: కావలి పట్టణంలోని పాతూరు నుండి పెద్ద ఎత్తున నాయకులు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పాతూరులో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి కృష్ణారెడ్డి, కావలి పెద్ద చెరువు మాజీ డైరెక్టర్ వాకా శ్రీనివాస్ రెడ్డి, అమ్ములూరు రఘురామిరెడ్డి, కంసాని శ్రీకాంత్, బొంత సురేష్, కొర్సుపాటి రవీందర్ రెడ్డి, వాకా చంద్రారెడ్డి, వింత నారపరెడ్డి, గొడ్డేటి శ్రీనివాసులు, గుద్దేటి పవన్, తదితరులు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కావలి అసెంబ్లీ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
Admin
Amaravathi Jyothi