Amaravathi Jyothi - Telagana / Hyderabad : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధమైన ఎల్ బి స్టేడియం హైదరాబాద్, అమరావతి జ్యోతి: -రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియం సిద్ధమైంది. సభలో మూడు వేదికలు - ప్రజా వేదికపై రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు. చేశారు. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు.గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్, కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లు. -అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ. -తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ. ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు. ఉదయం నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్ కు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు,అభిమానులు... ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు ...
Admin
Amaravathi Jyothi