Amaravathi Jyothi - Telagana / Hyderabad : - కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -అసలు ఆట ఇప్పుడే మొదలైంది- కేటీఆర్. హైదరాబాద్, అమరావతి జ్యోతి: ---ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తాం ---సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టింది ---కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు ---ప్రతి ఏడాది పీ ఏ సీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నాం ---ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం ---లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? ---మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం ---రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు ---రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారు ---ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు ---ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు ---ఇచ్చిన హామీలు చాలా ఉన్నయి ---ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి ---రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైంది? ---మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీ లకు చట్టబద్దత తెస్తమన్న హామీ ఎక్కడ?
Admin
Amaravathi Jyothi