Amaravathi Jyothi - Telagana / Hyderabad : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ముందే చెప్పిన శ్రీ విద్యా సర్వమంగళం పీఠాధిపతి శ్రీ మురపాక కాళిదాసు శర్మ... హైదరాబాడ్,అమరావతి జ్యోతి :ఆయన ప్రధాన పార్టీ నాయకులకు ముందే పంపిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తుంది.... ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై ఇటీవల ఈయన ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది..తెలంగాణ రాష్ట్రంలో కాలచక్ర ప్రశ్నానుసారం వచ్చేది కాంగ్రెస్ పార్టీ కారణం ఏమిటంటే తెలంగాణ అనేటటువంటి ఒక సెంటిమెంటు తో కెసిఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో పార్టీ ఆవిర్భావం జరిగినది ఇప్పుడు దాన్ని భారతీయ రాష్ట్ర సమితి అనే పేరు మార్చడం జరిగింది ఇక్కడే ఆవిర్భావ కాలానుసారము కెసిఆర్ కు ప్రతికూల ఫలితాన్ని పరిపూర్ణంగా ఇస్తుంది భారతీయ రాష్ట్ర సమితి అనేటటువంటి పేరు ప్రస్తుత కాల చక్ర పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకుడిని మాత్రం రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాన్ని ఇవ్వదు ఇది ఒక రకంగా కెసిఆర్ కి కచ్చితంగా చెడు ఫలితాలను ఇస్తుంది దీనివల్ల ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది
Admin
Amaravathi Jyothi