Amaravathi Jyothi - Telagana / Hyderabad : కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు హైదరాబాద్, అమరావతి జ్యోతి: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి రేషన్ కార్డులను అందిం చేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ముహుర్తం ఖరారు చేసింది.అర్హుల ఎంపిక కోసం కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులోభాగంగా ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నారు. దీంతో ఈనెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తులను స్వీకరిం చనున్నారు. అర్హుల ఎంపిక క్షేత్రస్థాయిలోనే జరగనుంది. అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమయంలోనే సమర్పిం చాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను గ్రామం, బస్తీ సభల ద్వారా అధికారులు ఎంపిక చేస్తారు.
Admin
Amaravathi Jyothi