Amaravathi Jyothi - National / : హిమాలయ శిఖరాలపై కందుకూరు టిడిపి జెండా వలేటివారిపాలెం ,అమరావతి జ్యోతి: కందుకూరు నియోజకవర్గం నుంచి ఇంటూరి నాగేశ్వరరావు అఖండ మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ..హిమాలయ శిఖరంపై యువకులు జెండా ఎగురవేశారు. వలేటివారిపాలెం మండలం జడ్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన సోమినేని నరేష్, సోమినేని మనోహర్ మరియు కోటపాటి శ్రీకాంత్ లు తెలుగుదేశం జెండాను ఎగురవేశారు. మంచి మనసున్న నాయకుడు ఇంటూరి నాగేశ్వరరావు , రాజకీయాల్లో హిమాలయాల అంత ఎత్తుకు ఎదగాలని... నియోజవర్గ యువత ఆయన వెంటే నడుస్తోందని వారు తెలిపారు. నాగేశ్వరరావు విజయాన్ని మళ్ళీ ఇదే హిమాలయాలపై జరుపుకుంటామని తెలియజేశారు.
Admin
Amaravathi Jyothi